Monday, December 20, 2021

ది ప్రీస్ట్ - వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

కొత్తకొత్త సూపరహిట్ సినిమాలతో తెలుగు సినీ అభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తున్న స్టార్ మా మూవీస్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. స్టార్ మా మూవీస్ తో పాటు మరెన్నో టీవీ చానెల్స్ లను యప్ టీవీ ద్వారా చూసి ఆనందించండి.

మలయాళ సినిమా మెగాస్టార్ మమ్ముట్టి ప్రధానపాత్ర పోషించిన తాజా చిత్రం ‘ది ప్రీస్ట్’ వరల్డ్ ప్రీమియర్ ఈ డిసెంబర్ 24వ తేదీన స్టార్ మా మూవీస్ లో మన ముందుకు రానుంది. ఈ యేడాది థియేటర్ లో విడుదలైన ఈ సినిమా వైవిధ్యభరితమైన కథాంశంతో ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడడంతో గత యేడాది  విడుదల కావాల్సిన ఈ క్లాసిక్ హారర్ మిస్టరీ ఈ సవంత్సరంలో విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించడానికి బుల్లితెరపై వస్తున్న ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ను యప్ టీవీలో చూడడానికి రెడీ అవ్వండి.

మమ్ముట్టి, మంజు వారియర్, నిఖిలా విమల్, బేబీ మోనిక, సానియా ఇయ్యప్పన్ ప్రధాన పాత్ర పోషించిన ది ప్రీస్ట్ కథ ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతూ వీక్షకులను సీట్ అంచున కూర్చోబెడుతుంది. సంపన్నులైన ఓ కుటుంబంలోని వ్యక్తులు ఒక్కొక్కరుగా ఆత్మహత్యలు చేసుకోవడం వెనకున్న రహస్యాన్ని తెలుసుకోవాలని ఫాదర్ కార్మెన్ బెనెడిక్ట్ (మమ్ముట్టి) సహాయాన్ని దివ్య అలెక్స్ (సానియా ఇయ్యప్పన్) కోరడంతో కథ మొదలవుతుంది. ఈ మిస్టరీని ఫాదర్ చేధించే క్రమంలో ఎదురైన సంఘటనలు, కలిసిన వ్యక్తులు, ఒళ్ళు గగ్గురుపొడిచే నిజాలతో ఈ సినిమా ఆసక్తిగా సాగుతుంది. చివరికి ఫాదర్ బెనెడిక్ట్ ఆ రహస్యాన్ని కనిపెట్టాగాలిగాడా లేదా అన్నదే కథలోకీలకాంశం.

ఫాదర్ బెనెడిక్ట్ గా మమ్ముట్టి అద్భుతమైన నటన ఈ చిత్రానికి హైలైట్. మొదటిసారి మమ్ముట్టి, మంజు వారియర్ కలిసి నటించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఎక్కువయ్యింది. అమేయా పాత్రలో బేబీ మోనిక చాలా బాగా నటించింది. మొదటి సినిమా అయినప్పటికి జోఫిన్ టి చాకో దర్శకుడిగా మంచి ప్రతిభను చూపించాడు. రాహుల్ రాజ్ సంగీతం మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. అఖిల్ జార్జ్ విజువల్స్ టాప్ క్లాస్ రేంజ్ లో ఉండడం సినిమాకు పెద్ద ప్లస్.

హారర్ జోనర్ ఇష్టపడే వారు, మమ్ముట్టి నటనకు అభిమానులయినవారు స్టార్ మా మూవీస్ లో యప్ టీవీ ద్వారా డిసెంబర్ 24, సాయంత్రం 6 గంటలకు ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ను చూసేయ్యండి. మీరు భయపడడం మాత్రం పక్కా.